నిదురిస్తున్న ఎద ఉలిక్కిపడి లేచి చూస్తే
ఎదురుగా నీ జ్నాపకాల మరకలు
ధ్యానముద్రలో ఉన్న ఋషికి
తపోభంగం కలిగించినట్లు
అపుడెపుడో నీవు విసిరిన
చిలిపి చూపుల తూపులు
ఇప్పటికీ నా కంటి కుహరాల్లాంచి
పరుగెడుతూనే ఉన్నై
నా ఎదను తాకటానికి
నిశాంత చంద్రికనై
నీరశించిపోతున్నా
దిశాంతాలవైపు
చూస్తున్నదెందుకో తెలుసా
మళ్లీ పూర్ణిమ వస్తుందని
నాకు తెలుసుగనుక
సాహితీప్రియగారూ! మీ కవిత్వం నిజంగా మతిపోగొడుతోంది... ఉదయాన్నే ఇంత మంచి కవిత్వాన్ని రుచి చూపినందుకు మీకు ధన్యవాదాలు! ఓ కవి చమత్కరించినట్టు... తరచి చూస్తే ప్రతి గుండె ఓ మల్లెతోట. ఆ గుండెను సందర్శించినప్పుడల్లా.. సువాసనలు ఇదిగో ఇలా గుప్పుమంటుంటాయి!!
ReplyDeleteఇట్లు ఆది, తెలుగుశాల
మరో కవిత్వం ఎప్పుడు పెడుతున్నారు... అభిమానులు వెయిటింగ్!
ReplyDeleteకవిత చాలా బాగుంది.రెండు అక్షరదోషాలు కొద్దిగా సరిచేసుకోండి. చాలా బాగా రాసారు.
ReplyDeleteబ్లాగులోకానికి స్వాగతం.
సాహితీప్రియగారూ! ఇది మీకే భావ్యంగా వుందా చెప్పండి. మీ కవితకై నిరీక్షించువారి కోసం కాస్తైనా కరుణ చూపరా!! మరో కవిత ఎప్పుడు పెడుతున్నారు? మీకో విషయం తెలుసా... నీరాకకై కవితను నా డెస్క్ మీద ఉంచుకున్నాను తెలుసా. అందులోని ఆఖరు రెండు లైన్లలో ఉన్న ఆశావాద దృక్పథం నాకు చాలా బాగా నచ్చింది. కనుక మరో కవిత ప్లీజ్!!!
ReplyDelete